వృద్ధాప్య పెన్షన్ అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన తెలంగాణ సర్కార్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, March 09, 2020

వృద్ధాప్య పెన్షన్ అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన తెలంగాణ సర్కార్

తెలంగాణ వాసులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త . ఆదివారం బడ్జెట్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం వృద్దులకు ఇచ్చేపెన్షన్ అర్హత వయసు.... 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. ఇక నుంచి 57 ఏళ్లు ఉన్న వృద్ధులందరికీ కూడా ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పథకం కింద పెన్షన్లు అందివ్వనుంది. ఆదివారం ప్రకటించిన బడ్జెట్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు... ఆసరా లబ్దిదారుల సంఖ్య 7 నుంచి 8 లక్షలకు పెరగడానికి అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. 2019-20లో రూ. 9402 కోట్లు కేటాయించగా... ఈసారి బడ్జెట్‌లో రూ. 2356 కోట్లు పెంచి.. రూ.11758 కోట్లు కేటాయింపులు చేశారు. అర్హత వయసు కూడా 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదించడంతో వృద్ధాప్య కేటగిరిలో అదనంగా ఏడు లక్షలమందికి లబ్ది చేకూరనుంది. దీంతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా పరిష్కరిస్తూ దాదాపు మరో లక్ష మందికి ఆసరా అందనుంది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ పథకంలో లబ్ది దారుల సంఖ్య దాదాపు 47 లక్షలకు చేరనుంది.

Post Top Ad