మాజీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు "బంగారు లక్షణ్" 6వ వర్థంతి లో పాల్గొన్న ప్రముఖులు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, March 01, 2020

మాజీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు "బంగారు లక్షణ్" 6వ వర్థంతి లో పాల్గొన్న ప్రముఖులు

మాజీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన  బంగారు లక్షణ్ ఆరవ వర్థంతిని హైదరాబాద్ నగరంలోని భాజాపా కార్యాలయంలో  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరేందర్ కుమార్ , రామోజీ , విశ్వనాధ్ ముదిరాజ్ , ఆంజనేయులు , ప్రవీణ్ , జైవీర్ , రాహుల్ , అడ్వాకెట్ శ్రీనివాస్ యాదవ్ , నాగరాజ్ , బాలరాజ్ గౌడ్  పలువురు పాల్గొన్నారు  .  బంగారు లక్షణ్ గారి కృషి ని కొనియాడారు . వారికీ నివాళులు ఘటించారు .
 రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలోని సిద్దంతి బస్తీలోని అతి సామాన్య దళిత కుటుంబంలో జన్మించాడు. హైదరాబాద్ నాంపల్లి గవర్నమెంట్ హైస్కూలులో పదవ తరగతి వరకు, ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చదివాడు. 12 ఏళ్ల వయస్సులోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరాడు. 1958 -69 వరకు రాష్ట్ర విద్యుత్ శాఖలోనూ, కేంద్ర రైల్వే, ఏజీ శాఖలలో వివిధ ఉద్యోగ బాధ్యతలను నిర్వహించి ఆ తరువాత జనసంఘ్‌లో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా చేరిపోయాడు. బీహెచ్‌ఈఎల్, మిథానీ, ఎఫ్‌ఐసీ కార్మిక నాయకుడి బాధ్యతలు నిర్వహించిన ఈయన 1975లో అత్యవసర పరిస్థితి కాలంలో జైలుకు వెళ్ళాడు. 1986-88 కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా పనిచేశాడు. 1996లో రాజ్యసభకు ఎన్నికై 1999-2000 కాలంలో అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో రైల్వేశాఖ సహాయమంత్రిగా పనిచేశాడు. 2000-01 కాలంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఈయన భార్య సుశీలా లక్ష్మణ్ 14వ లోకసభకు రాజస్థాన్ లోని జూలోర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైనది. 1978లో అప్పటి జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానూ, 1986లోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండేళ్ల పాటు పదవీ బాధ్యతలు నిర్వహించాడు. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడుగా ఏడేళ్లు పనిచేశాడు. 1985- 86 మధ్య కాలంలో రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగానూ, 1996లో గుజరాత్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగాను ఎన్నికయ్యాడు. వాజ్‌పేయ్ మంత్రివర్గంలో రైల్వే, ప్లానింగ్ మరియు ప్రోగామింగ్ మంత్రిత్వ శాఖల సహాయ మంత్రిగా, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడుగా పనిచేశాడు.