మాదాపూర్‌ జోన్‌ పరిధిలో 963 ఆటోలపై కేసులు : ‘మై ఆటో ఈజ్‌ సేఫ్‌’ ఆటోలకి తప్పనిసరి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, March 10, 2020

మాదాపూర్‌ జోన్‌ పరిధిలో 963 ఆటోలపై కేసులు : ‘మై ఆటో ఈజ్‌ సేఫ్‌’ ఆటోలకి తప్పనిసరి


మాదాపూర్‌లోని ఇనార్బిట్‌ మాల్‌ ఎదురుగా పోలీసు అవుట్‌పోస్టు, కూకట్‌పల్లి ఓల్డ్‌ ట్రాఫిక్‌ ఠాణా, రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ ఠాణా, అల్వాల్‌ ట్రాఫిక్‌ ఠాణాలకు ఆటోడ్రైవర్, యజమాని, అడ్రస్, రిజిస్ట్రేషన్‌ వివరాలు, డ్రైవింగ్‌ లైసెన్స్, గుర్తింపు కార్డులు మొదలగు వివరాలను ఆటోడ్రైవర్లువెంట తెచ్చుకోవాలి. అవి పోలీసులకు చెబితే పోలీసులు జీపీఎస్‌ ఆధారిత వ్యవస్థలో నమోదుచేస్తారు. ఆ ఆటోకు క్యూఆర్‌ బార్‌కోడ్‌ బయట అతికిస్తారు. బార్‌కోడ్‌ను ప్రయాణికులు క్యూఆర్‌ కోడ్‌ యాప్‌ ద్వారా స్కాన్‌ చేస్తే  ఆటో వివరాలు తెలుస్తాయి. ఇతరులెవరైనా ప్రమాదంలో చిక్కుకుంటే పోలీసులు వారిని వెంటనే కాపాడేందుకు వీలవుతుంది. అయితే నిబంధనల ప్రకారం పూర్వపు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎక్కడా రిజిస్ట్రేషన్‌ అయిన ఆటోలు (త్రీ వీలర్స్‌) సైబరాబాద్‌ పరిధిలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని గత కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్నారు. అయితే ఇప్పటివరకు మాదాపూర్‌ ట్రాఫిక్‌ డివిజన్‌లోని  మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మియాపూర్‌ ట్రాఫిక్‌ ఠాణాల పరిధిలో దాదాపు 9,360 ఆటోలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి. ఇంకా కొంత మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా సైబరాబాద్‌లోని మాదాపూర్‌ ఐటీ కారిడార్‌లో తిప్పుతున్నారు. ఈ ఆటోలపై కొరడా ఝుళిపిస్తున్నామని మాదాపూర్‌ డివిజన్‌ ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు.