దుద్దిళ్ల శ్రీధర్ బాబు పార్టీ మారుతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించకపోవడంతో ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. అంతేకాదు దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు తన నియోజకవర్గంలో అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోవడం కూడా ఆయన్ను ఆవేదనకు గురిచేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అధికారులంతా పుట్టా మధుకే సపోర్ట్ చేస్తుండటంతో శ్రీధర్ బాబు ఒక్కింత నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ మారాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయినట్లు సన్నిహితులు చెబుతున్నారు.మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపించడంలో కీలకంగా వ్యవహరించిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతుండటంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది
Post Top Ad
Wednesday, March 04, 2020
Admin Details
Subha Telangana News