భూ ఆక్రమణలపై రేవంత్ రెడ్డి కి భారీ షాక్ : క్రిమినల్ కేసులు నమోదు ....! - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, March 04, 2020

భూ ఆక్రమణలపై రేవంత్ రెడ్డి కి భారీ షాక్ : క్రిమినల్ కేసులు నమోదు ....!

గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 127లో ఉన్న భూమిలో కొంత భాగాన్ని రేవంత్ రెడ్డి ఆక్రమించారని స్థానికులు గతంలోనే ఆరోపించారు. ఈ భూమిని ఓ వ్యక్తి నుంచి కొన్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించారని కొందరు, తమ పేరిట మ్యుటేషన్ చేసేందుకు డబ్బులిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ఇవ్వలేదని మరికొందరు ఆరోపించడం గమనార్హం. స్థానికులు కొందరు ఈ వ్యవహారంపై హైకోర్టును కూడా ఆశ్రయించారు. అనంతరం ఈ వ్యవహారంపై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్.. తప్పుడు పత్రాలు సృష్టించి, ఈ భూమి మ్యుటేషన్ జరిగిందని నిర్ధారించి సీఎస్‌కు నివేదిక ఇచ్చారు. తప్పుగా రికార్డుల్లో నమోదు చేశారని, తప్పుడు మ్యుటేషన్లు చేశారని కలెక్టర్ ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గోపన్‌పల్లి భూ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్న ఆరపణలపై ప్రత్యేక అధికారితో విచారణ జరిపించాలని ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం నిర్ణయించింది. ఈ క్రమంలోనే దర్యాప్తు జరిపిన ఆర్డీవో చంద్రకళ మంగళవారం తన విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేశారు.ఈ భూ ఆక్రమణలపై ఇప్పటికే రేవంత్ రెడ్డిపై ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన అధికారులు ఆక్రమణలు నిజమేనని తేల్చారు. రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్న 10.20 ఎకరాల భూమి ఆక్రమించిందని రెవెన్యూ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. దీంతోపాటు సర్వే నెంబర్ 127లోనే మరో 5.5 ఎకరాలకు టైటిల్ లేనట్లుగా గుర్తించారు. ఈ మేరకు రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ దీనిపై పూర్తి నివేదికను మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు.ఈ నివేదికలో ఆర్డీవో చంద్ర కళ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఎకరం 36 గుంటల భూమిని అక్రమంగా మ్యుటేషన్ చేయించుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, ఓల్టా చట్టాన్ని ఉల్లంఘించినందుకుక రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆర్డీవో తన నివేదికలో సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన గోడలను కూడా కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )