కరోనా వైరస్ కి ఉచితంగా చికిత్స అందించేందుకు ముందుకు వచ్చిన ప్రయివేట్ మెడికల్ కాలేజీలు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, March 05, 2020

కరోనా వైరస్ కి ఉచితంగా చికిత్స అందించేందుకు ముందుకు వచ్చిన ప్రయివేట్ మెడికల్ కాలేజీలు

వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రులు కూడా సేవలందించేందుకు ముందుకొచ్చాయని ఆయన వెల్లడించారు. బుధవారం  సాయంత్రం కరోనా వైరస్ అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక బాధ్యతతో కరోనా బాధితులకు ఉచితంగా చికిత్స అందించేందుకు ముందుకు వచ్చిన ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు మంత్రి ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. అటు ప్రభుత్వం కూడా చర్యలు వేగవంతం చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదైందని.. వదంతులతో ఆందోళనకు గురి కావొద్దని ఆయన సూచించారు. కరోనా వైరస్ పరీక్షలకు సంబంధించిన కిట్లు గాంధీ ఆస్పత్రిలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అనుమానిత కేసులకు సంబంధించిన శాంపిల్స్ ఇక్కడకు పంపిస్తుండగా.. పరీక్షలు నిర్వహించి నివేదికలు అందిస్తున్నారు. కరోనా పాజిటివ్ లక్షణాలు తేలితే.. పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు కూడా పంపించి నిర్ధారించుకుంటున్నారు. కరోనా వైరస్ బాధితుల కోసం గాంధీ ఆస్పత్రితో పాటు ఉస్మానియా ఆస్పత్రిలోనూ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. తాజాగా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ముందుకువచ్చాయి.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )