కరోనా వైరస్ కారణంగా బీజేపీ బహిరంగ సభ వాయిదా - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, March 04, 2020

కరోనా వైరస్ కారణంగా బీజేపీ బహిరంగ సభ వాయిదా

హైదరాబాద్‌లో కోవిడ్ 2019 వైరస్  కేసు నమోదైన నేపథ్యంలో హైదరాబాద్‌లో భాజపా  బహిరంగ సభ రద్దు చేస్తున్నట్లు తెలంగాణ బీజేపీవెల్లడించింది . హైదరాబాద్‌లో మార్చి 15న సీఏఏ అనుకూల సభ నిర్వహించాలని తెలంగాణ బీజేపీ ప్లాన్ చేసింది. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతారని ఇప్పటికే ప్రకటించారు. అయితే.. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సభను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ బీజేపీ బుధవారం (మార్చి 4) తెలిపింది. సభను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనేది తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరు కాబోయే ఈ సభ ద్వారా.. సీఏఏపై ఎంఐఎంతో పాటు టీఆర్ఎస్‌ చేస్తు్న్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని బీజేపీ భావించింది. అయితే.. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో.. భారీ బహిరంగ సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ కారణంగానే హైదరాబాద్‌లో అమిత్ షా పాల్గొనబోయే సభ వాయిదా వేసినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.