తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గా శశాంక్‌ గోయల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, March 07, 2020

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గా శశాంక్‌ గోయల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

తెలంగాణ  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గా శశాంక్‌ గోయల్‌ను నియమిస్తూ   ఉత్తర్వులు  జారీ  చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి  గతంలో ఆయన సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా, పర్యాటక, సాంస్కృ తిక శాఖ కార్యదర్శిగా, ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేశారు. అంతకుముందు కొంత కాలం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శిగా డిప్యూటేషన్‌పై పనిచేశారు. విద్యా శాఖ డైరెక్టర్‌గా, నిజామాబాద్, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా కూడా వ్యవహరించారు. అయిన ఆయన ప్రస్తుతం కార్మిక, ఉపాధి కల్పన, కర్మాగారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. గతంలో సీఈవోగా పనిచేసిన రజత్‌కుమార్‌ను ప్రభుత్వం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిం చిన నేపథ్యంలో ఆయన స్థానంలో తాజాగా సీఈసీ శశాంక్‌ గోయల్‌ను నియమించింది.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad