ఢిల్లీ అల్లర్ల పై హైదరాబాద్ లో స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, March 01, 2020

ఢిల్లీ అల్లర్ల పై హైదరాబాద్ లో స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

గచ్చిబౌలిలోని ఐఎస్‌బీలో ఏర్పాటు చేసిన 'ఐడియాస్ ఫర్ ఇండియా-2020' ఐఎస్‌బీ పాలసీ కాంక్లేవ్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఢిల్లీ అల్లర్లపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. సోషల్ మీడియాల్లో అసత్య ప్రచారాలే ఢిల్లీ అల్లర్లకు కారణమని అన్నారు. రాజకీయ పార్టీలలు రెచ్చగొట్టే దోరణి కూడా అల్లర్లకు కారణమవుతున్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోర్టు ఢిల్లీలో కపిల్ మిశ్రా సహా బీజేపీ నేతల విద్వేష ప్రసంగాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాగా, ఢిల్లీ ఘటనలో పోలీసు అధికారులను కూడా ఆందోళనకారులు కిరాతకంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి.పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు ఎక్కువయ్యాయని, ఢిల్లీ విధ్వంసానికి కూడా వారే కారణమని అన్నారు. ఢిల్లీ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేపడుతోందని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనేది ఏ భారతీయుడీ పౌరసత్వాన్ని తొలగించదని స్పష్టం చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో అణచివేతకు, వివక్షతకు గురైన మైనార్టీలైన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, తదితరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు మాత్రమేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, ఇటీవల ఢిల్లీలో జరిగిన సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల ఘర్షణలో 42 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరు పోలీసులను కూడా ఆందోళనకారులు దారుణంగా హత్య చేశారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )