బైక్‌ను వెనకాల నుంచి ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు : స్విగ్గీ డెలివరీ బాయ్‌ మృతి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, March 10, 2020

బైక్‌ను వెనకాల నుంచి ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు : స్విగ్గీ డెలివరీ బాయ్‌ మృతి

హైదరాబాద్‌లోని మియాపూర్‌‌లో ఆర్టీసీకి చెందిన ఓ బస్సు ఓ బైక్‌ను వెనకాల నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సుమన్‌ ‌నాయక్‌గా గుర్తించారు. సుమన్ కొంత కాలంగా మియాపూర్‌లో నివాసం ఉంటూ.. స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. జహీరాబాద్‌ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారంసాయంత్రం హైదరాబాద్‌ నుంచి బీదర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post Top Ad