రేవంత్‌ రెడ్డి కేసు లో తీర్పు ను రేపటికి వాయిదా వేసిన ఉప్పర్‌ పల్లి కోర్టు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, March 10, 2020

రేవంత్‌ రెడ్డి కేసు లో తీర్పు ను రేపటికి వాయిదా వేసిన ఉప్పర్‌ పల్లి కోర్టు

 రేవంత్‌ రెడ్డి తరపు న్యాయవాది ఈ నెల 6న ఉప్పర్‌ పల్లి కోర్టులో ఆయన బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశారు. కాంగ్రెస్‌ ఎంపి రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ పై ఉప్పర్‌ పల్లి కోర్టు నేడు విచారణ చేపట్టింది.ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఉప్పర్‌ పల్లి కోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ ఫాంహౌస్‌పై డ్రోన్‌ ఎగురవేసిన కారణంగా రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇవాళ విచారణ అనంతరం కోర్టు ఆయనకు బెయిల్‌ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా వేసింది. మంత్రి కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌పై డ్రోన్‌ ఎగురవేసిన కేసులో 8 మందిని నిందితులుగా చేర్చి అరెస్ట్‌ చేశారు నార్సింగి పోలీసులు. గత విచారణలో ఆరుగురికి రాజేంద్రనగర్‌ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో డ్రోన్ కెమెరా కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు మాత్రం కోర్టు రేపటికి వాయిదా వేసింది. మరోవైపు ఎంపీ రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో చర్లపల్లి సెంట్రల్‌ జైలు వద్ద కూడా పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. రేపు ఆయనకు బెయిల్ దక్కే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Post Top Ad