తెలంగాణ రాష్ట్రంలోని మనోహరాబాద్‌ కొత్తపల్లి రైల్వే లైన్ పనులలో భారీ పురోగతి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, March 14, 2020

తెలంగాణ రాష్ట్రంలోని మనోహరాబాద్‌ కొత్తపల్లి రైల్వే లైన్ పనులలో భారీ పురోగతి


తెలంగాణ రాష్ట్రంలో మనోహరాబాద్‌ కొత్తపల్లి రైల్వే లైన్ పనులలో భారీ పురోగతి  2020-21 ఆర్థిక సంవత్సరానికి రైల్వే బడ్జెట్‌లో కేంద్రం మనోహరాబాద్‌ కొత్తపల్లి రైల్వే లైన్‌ కోసం రూ. 235 కోట్లు కేటాయించగా ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.100కోట్లు కేటాయించింది. ఇప్పటికే మొదటి విడుత గజ్వేల్‌ వరకు రైల్వే పనులు ట్రాక్‌, స్టేషన్లు, ఆర్‌యూబీ, ఆర్వోబీ నిర్మాణాలు పూర్తయ్యాయి. రెండో విడుత పనుల్లో భాగంగా గజ్వేల్‌ నుంచి సిద్దిపేట వరకు భూసేకరణ పూర్తి కాగా, దుద్దెడ వరకు రైల్వేట్రాక్‌ టెండర్‌ కూడా ఇటీవలే ముగిసింది.గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలో మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు మూడు రైల్వేస్టేషన్లు నిర్మిస్తున్నారు. గజ్వేల్‌లో రైల్వేస్టేషన్‌ కోసం 45ఎకరాలు కేటాయించగా, నిర్మాణ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. గజ్వేల్‌లో అధునాతన భవన సముదాయంతో రైల్వేస్టేషన్‌ నిర్మాణమవుతున్నది. ఇందులో ప్రయాణికుల కోసం ప్రత్యేక సీట్లు, విశ్రాంతి గదులు, టికెట్‌ కౌంటర్లు, టాయిలెట్లు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. విశాల పార్కింగ్‌, స్టేషన్‌ నుంచి జాలిగామ, గజ్వేల్‌ రోడ్డు వరకు ప్రత్యేక రోడ్డును నిర్మిస్తున్నారు. అలాగే గజ్వేల్‌, ధర్మరెడ్డిపల్లి రోడ్డు వైపు రింగు రోడ్డు జంక్షన్‌ వరకు ప్రత్యేక రోడ్డుకు చర్యలు చేపట్టారు. నాచారం, బేగంపేటలో రైల్వేస్టేషన్ల నిర్మాణం కొనసాగుతున్నది.

Post Top Ad