రేవంత్ రెడ్డి కేసు విషయంలో నివేదిక సమర్పించిన రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, March 03, 2020

రేవంత్ రెడ్డి కేసు విషయంలో నివేదిక సమర్పించిన రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ

గోపనపల్లి గ్రామంలోని సర్వే నెంబర్‌ 127లో ఉన్న భూమిలో కొంత భాగాన్ని రేవంత్‌రెడ్డి ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూమిని ఓ వ్యక్తి నుంచి కొన్నట్టుగా నకిలీ పత్రాలు సృష్టించారని కొందరు, తమ పేరిట మ్యుటేషన్‌ చేసినందుకు డబ్బులిస్తామని చెప్పి ఇవ్వలేదని కొందరు ఆరోపిస్తున్నారు. స్థానికులు కొందరు ఈ విషయంలో కోర్టును ఆశ్రయించగా స్టేటస్‌కో ఉత్తర్వులు వచ్చాయని అంటున్నారు. అయితే, ఈ విషయంపై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌.. తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా ఈ భూమి మ్యుటేషన్‌ జరిగిందని నిర్ధారించి సీఎస్‌కు నివేదిక ఇచ్చారు. తప్పుగా రికార్డుల్లో నమోదు చేశారని, తప్పుడు మ్యుటేషన్లు చేశారని ఆ నివేదికలో కలెక్టర్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ భూమితో పాటు ఇతర ఆరోపణలపై కూడా ప్రత్యేక అధికారి చేత విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి భూ అక్రమాలపై రెవెన్యూ అధికారుల విచారణ పూర్తయింది. గోపన్‌పల్లిలోని సర్వే నెంబర్‌ 127లో రేవంత్‌రెడ్డి, కొండల్‌ రెడ్డిలు అక్రమంగా భూ మ్యుటేషన్‌లు, కబ్జాలకు పాల్పడినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. రేవంత్‌రెడ్డి ఆధీనంలో ఉన్న10.20 ఎకరాల భూమి ఆక్రమించిందని రెవెన్యూ అధికారులు తేల్చారు. దీనితో పాటు సర్వే నెంబర్‌ 127లనే 5.5 ఎకరాలకు టైటిల్‌ లేనట్టు గుర్తించారు. ఈ మేరకు రాజేంద్రనగర్‌  ఆర్డీవో చంద్రకళ పూర్తి నివేదికను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మంగళవారం సమర్పించారు. ఆర్డీవో నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఎకరం 36 గుంటల భూమిని అక్రమంగా మ్యుటేషన్‌ చేయించుకునట్లు నివేదికలో పేర్కొన్నారు.