ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలు : వెనక్కి తగ్గిన ఉత్తమ్ కుమార్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, March 12, 2020

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలు : వెనక్కి తగ్గిన ఉత్తమ్ కుమార్ రెడ్డి


తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి . ఒక వైపు రాజ్య సభ , మరో వైపు పార్టీ అధ్యక్ష ఎన్నికలు .  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి స్థానం నుంచి తాను తప్పుకోనున్నట్లు ప్రకటించారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతల వల్ల సొంత నియోజకవర్గం హుజూర్ నగర్‌కు సరిగా సమయం కేటాయించలేకపోతున్నాన్నట్లు ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆ స్థానం నుంచి తప్పుకుంటానని చెప్పారు. ఇకపై హుజూర్‌నగర్, కోదాడ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ సమయంలో హామీ ఇచ్చారు. హుజూర్‌నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో గత డిసెంబరు నెలాఖరులో జరిగిన ఓ సమావేశంలో ఉత్తమ్ ఈ విషయాన్ని ప్రకటించారు.భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి వరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా గురువారం ఆయన కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన అంశాలను కోమటిరెడ్డి ఆమె దృష్టికి తెచ్చినట్లుగా తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అధికారికంగా కోమటిరెడ్డి పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Post Top Ad