తెలంగాణ బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ స్వల్ప అస్వస్థత - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, March 09, 2020

తెలంగాణ బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ స్వల్ప అస్వస్థత

హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు . సోమవారం ఆయనకుగుండె నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం గురించి అపోలో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీత మాట్లాడుతూ.. దత్తాత్రేయ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ శ్రీనివాస్‌రావు ఆయనకు దగ్గరుండి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. రొటీన్‌ చెక్‌అప్‌లో భాగంగానే ఆయన ఆసుపత్రికి వచ్చారని పేర్కొన్నారు. వైద్యపరీక్షల అనంతరం మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జ్‌ చేస్తామన్నారు. ఆ తర్వాత సాయంత్రం బండారు దత్తాత్రేయ సిమ్లాకు బయలుదేరుతారు.

Post Top Ad