ఘనంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి స్వాగత సభ : పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, March 16, 2020

ఘనంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి స్వాగత సభ : పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి


తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తొలిసారిగా బండి సంజయ్ హైదరాబాద్‌ వచ్చారు. ఈయనకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఇతర సీనియర్‌ నేతలు, శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో  
బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో బీజేపీ జెండా రెపరెపలాడేలా ఎగురవేస్తాం. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తాం. బీజేపీ ఏ మతానికీ వ్యతిరేకం కాదు. అన్ని వర్గాలను సమానంగా చూస్తుంది. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే. ఎందరో యువకుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో సీఎం కేసీఆర్‌ రాజ్యం ఏలుతున్నారు. బీజేపీ కార్యకర్తలు, యువకులపై ఒక్క లాఠీ దెబ్బ పడ్డా చూస్తూ ఊరుకోను. రాష్ట్రంలో ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ ఒక నియంతలా వ్యవహరిస్తోంది. తెలంగాణలో మరో పార్టీ అధికారంలోకి రావాల్సిందే.’’

Post Top Ad