విమర్శలకు గురవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్" - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, March 09, 2020

విమర్శలకు గురవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్"


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.  పవన్ కళ్యాణ్ సినిమా చేస్తానని ప్రకటించగానే ఆయన అభిమానుల్లో ఆనందం ఉప్పొంగింది. ఒక్కసారిగా అందరూ అలర్ట్ అయిపోయి తమ హీరోని ఏ విధంగా చూస్తే వారు సంతృప్తి చెందుతారో, ఎలాంటి సినిమాలు తీస్తే వారు ఆనందిస్తారో సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అయితే బాలీవుడ్ మూవీ అయిన పింక్ సినిమాని రీమేక్ చేస్తున్నాడని తెలిసి అందరూ షాక్ అయ్యారు. కానీ అంతలోనే అసలు సినిమాలే వద్దన్న పవన్ కళ్యాణ్ సినిమాలు ఒప్పుకోవడమే గొప్ప అనుకుని సర్దిపెట్టుకున్నారు. దిల్ రాజు నిర్మాతగా వకీల్ సాబ్ చిత్రం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించకపోయినా ప్రమోషన్లు మాత్రం ఇప్పుడే స్టార్ట్ చేశారు. మొన్నటికి మొన్న వకీల్ సాబ్ టైటిల్ పోస్టర్ ని రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ టైటిల్ పోస్టర్ చూసిన చాలామంది బాగుందని ప్రశంసిస్తుంటే కొందరు మాత్రం సినిమా కథకి, పోస్టర్ కి అస్సలు సంబంధమే లేదని, ఆడవాళ్ళ గురించి సినిమా అయితే పోస్టర్ మీద ఒక్కరైనా ఆడవాళ్ళు ఎందుకు లేరని కొందరు స్త్రీ వాదులు ప్రశ్నించారు.