వరంగల్ జిల్లా ప్రతినిధి:వరంగల్ జిల్లా ప్రెస్‌క్లబ్ కోశాధికారి, సీనియర్ జర్నలిస్టు బొమ్మినేని సునిల్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో సునీల్‌రెడ్డిని అతనితోపాటు ఉన్న మరో వ్యక్తి దేవేందర్‌రెడ్డిని గుర్తుతెలియని దుండగులు నరికారు. స్నేహితులకు రావాల్సిన డబ్బుకోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లి వచ్చిన తర్వాత సునీల్ హత్యకు గురైనట్లు తెలుస్తోంది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ పాశవిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ అసోసియేషన్-ఇండియా (PEMRAI) జాతీయ అధ్యక్షులు వి .సుధాకర్ గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు .