తెలంగాణలో వర్ష సూచన : మూడు రోజులు పాటు కొనసాగొచ్చని అధికారులు వెల్లడి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, March 06, 2020

తెలంగాణలో వర్ష సూచన : మూడు రోజులు పాటు కొనసాగొచ్చని అధికారులు వెల్లడి


రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విదర్భ నుంచి రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి నెలకొని ఉంది. ఈ ద్రోణి కారణంగా తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో శుక్రవారం శనివారం ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావారణ శాఖ అధికారులు తెలిపారు.అకాల వర్షాలతో పలు చోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అకాల వర్షంతో వ్యవసాయ మార్కెట్‌లోని కందుల మద్దతు కొనుగోలు కేంద్రంలో కందులు తడిసిపోయాయి. గత నాలుగు రోజులుగా కొనుగోలు చేసిన దాదాపు 5 వేల కందుల బస్తాలను సకాలంలో ఎగుమతి చేయలేకపోయారు. మార్కెట్ యార్డులో ఓపెన్ ప్లేస్‌లో భద్రపరిచారు. దీంతో అవి తడిసి ముద్దయ్యాయి.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad