శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా స్క్రీనింగ్ వ్యవస్థ పని తీరును పరిశీలించిన సీపీ సజ్జనార్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, March 15, 2020

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా స్క్రీనింగ్ వ్యవస్థ పని తీరును పరిశీలించిన సీపీ సజ్జనార్


తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో సైబరాబాద్ కమిషనర్ సీపీ సజ్జనార్ శంషాబాద్ ఎయిర్ పోర్టును సందర్శించారు. అక్కడ కరోనా స్క్రీనింగ్ వ్యవస్థ పని తీరును పరిశీలించారు. విమానాశ్రయం మొత్తం కలయ తిరుగుతూ అంతా పరిశీలించారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను స్క్రీనింగ్ చేస్తున్న తీరుపై అధికారులతో అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా మూడు చోట్ల శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ టెస్టుల వ్యవస్థ ఏర్పాటు చేశారు. స్క్రీనింగ్ సెంటర్ల పనితీరు, అక్కడున్న అధికారులు వ్యవహరించిన తీరు, భద్రత తదితర అంశాలపై సమీక్షించారు. అంతే కాకుండా అక్కడ ఉన్న డాక్టర్లతో మాట్లాడారు. ప్రధానంగా విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను ఏ విధంగా థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు.. అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు. అనేదానిపై సమీక్షించారు. ఒకవేళ కరోనా లక్షణాలు ఉంటే వాళ్ళని ఏ విధంగా ఆస్పత్రికి తరలిస్తున్నారు అన్న దానిపైనా సీపీ సజ్జనార్ సమీక్ష చేశారు.

Post Top Ad