మేడ్చల్ జిల్లాలో మాన్యవర్ శ్రీ కాన్షీరాం" జయంతి .... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, March 16, 2020

మేడ్చల్ జిల్లాలో మాన్యవర్ శ్రీ కాన్షీరాం" జయంతి ....

మేడ్చల్ జిల్లా  కాప్రా  గాంధీనగర్ లోని కమ్యునిటీ హాల్ ప్రాంగణంలో "మాన్యవర్  శ్రీ కాన్షీరాం" గారి 86వ జన్మదినోత్సవ వేడుక నిర్వహించి వారికి నివాళి అర్పించారు . ఈ సందర్భంగా పలువురు నాయకులు  మాట్లాడుతూ   బాబాసాహెబ్ డా బి ఆర్ అంబేడ్కర్ గారి జీవితాన్ని, ఉద్యమాలను, రచనలు, అశయాలను లోతుగా అధ్యయనం చేసి రాజ్యాంగం ద్వారానే బహుజలైన BC,SC,ST,మైనారిటీ లకు అధికారం లభిస్తుందని తన ఇంటిని వదిలి  సైకిలు యాత్రలు,ఉపన్యాసాలు చేసి బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసి ఎన్నో అవమానాలు,ఒడిదుడుకులు ఎదుర్కొని  మాయావతి గారిని ముఖ్యమంత్రి చేసి బహుజనులు రాజ్యాధికారం  చేపట్టగలరని   నిరూపించారు.ఈ కార్యక్రమం లో  ముఖ్య అథితులుగా పాల్గొన్న TRS ఉప్పల్ నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు  భద్రుద్దిన్ గారు, లోక్ సత్తా రాష్ట్ర యువ సత్త అధ్యక్షులు బి శివరామ కృష్ణ గారు,TRS డివిజన్ మైనారిటీ అధ్యక్షులు  గౌస్ గారు,TRS డివిజన్ ఉపాధ్యక్షులు మరియు  గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు  ఎన్ మహేష్ గారు పాల్గొనగా గాంధీనగర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు జి సత్యనారాయణ, జి కృష్ణ, జి నర్సింగరావు, గోవర్ధన్, శ్రీకాంత్, రాకేష్, మనోజ్ కుమార్, నితిన్, గౌతమ్,మిట్టు, బన్నీ తదితరులు పాల్గొని
నివాలులర్పించారు..
                                                           

Post Top Ad