రాష్ట్రంలోని మురికివాడలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.అపరిశుభ్రతే కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణం అవుతుందని కరోనా వైరస్ మురికివాడల్లో ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, మురికి వాడల్లోని పేదలకు రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా మాస్క్‌లు, శానిటైజర్లు ఇవ్వాలని, ఈ అంశాన్ని పరిశీలించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ సంధర్భంగా చేపట్టిన విచారణలో ప్రస్తుతం గాంధీ, టీబీ, ఛాతీ, ఫీవర్ ఆస్పత్రుల్లో కరోనాకు చికిత్సతో పాటు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని కోర్టుకు ప్రభుత్వం తరపున లాయర్ వివరించారు. కరోనా తెలంగాణలో ఉందంటూ వార్తలు వ్యాప్తి చెందడంతో మాస్కుల ధరలను భారీగా పెంచారు వ్యాపారులు. ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని సొమ్ము చేసుకోవడానికి ఇదే అనువైన సమయంగా భావిస్తున్న వ్యాపారులు మాస్క్‌ల ధరలను ఆమాంతం పెంచేసి కృత్రిమ కొరత సృష్టించి అమ్మకాలు సాగిస్తున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )Post Top Ad
Friday, March 06, 2020
ప్రీ గ కరోనా వైరస్ కట్టడికి మాస్క్ లు ఇవ్వనున్న ప్రభుత్వం
Admin Details
Subha Telangana News