గర్భవతి ప్రాణాలను బలికొన్న ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, March 13, 2020

గర్భవతి ప్రాణాలను బలికొన్న ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం

వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం మొరంగపల్లికి దారుణం చోటుచేసుకుంది . ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం గర్భవతి అయినా తల్లి బిడ్డలా ప్రాణాలను ,కడచేర్చింది  వివరాలలోకి వెళ్తే  మీనా గర్భవతి. నిండుచులాలు కావడంతో ఆమెకు నొప్పులు వచ్చిన  వెంటనే మోమిన్ పేట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యం చేసిన సిబ్బంది.. నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. భయపడిపోయిన వారు 108 వాహనంలో సదాశివపేట తరలించారు. కానీ అక్కడ కూడా వైద్యులు తమ చేతిలో ఏమీ లేదని.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించేలోపు.. గర్బిణి మృతిచెందారు.గర్బిణి చనిపోవడంతో కుటుంబసభ్యుల, బంధువులు రోదనలు మిన్నంటాయి. మీనా మృతికి కారణం మోమిన్ పేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులే కారణం అని ఆరోపించారు. వారు వెంటనే స్పందిస్తే.. దారుణం జరిగి ఉండేది కాదన్నారు. మీనా మృతదేహాన్ని మోమిన్ పేట్ ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఉంచి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకొన్న సీఐ నగేశ్.. తమ సిబ్బందితో కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబసభ్యులను నచ్చజెప్పారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మీనా చనిపోయిందని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. పై అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని వారిని శాంతింపజేశారు.