మౌలాలి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం : దగ్ధమైన భోగి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, March 14, 2020

మౌలాలి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం : దగ్ధమైన భోగి

మౌలాలి రైల్వే స్టేషన్‌లో ఈరోజు  మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో రైలు ఆగి ఉండటం, బోగీల్లో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.  అగ్నిమాపకదళ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.ఈ ప్రమాదంలో ఒక బోగి పూర్తిగా మంటల్లో కాలిపోగా.. మరో బోగీ పాక్షికంగా దగ్ధమైంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన ట్రెయిన్.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తున్న ప్రత్యేక రైలని తెలుస్తోంది. అందువల్ల రైల్లో ప్రయాణికులెవరూ లేరని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post Top Ad