జన్వాడలో నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ ఫామ్ హౌస్‌పై డ్రోన్ కెమెరా వాడిన కేసులో రేవంత్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రేవంత్.. అక్కడి నుంచి నేరుగా నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. డ్రోన్ కెమెరా వాడిన కేసులో తనపై సెక్షన్ 188, 287, 109, 120(b) కింద కేసు ఎలా నమోదు చేస్తారని రేవంత్ పోలీసులతో వాదనకు దిగారు. అలాగే ఆ ఘటనకు సంబంధించి తన ప్రమేయం గురించి వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన పోలీసులకు సహకరించేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ప్రభుత్వాస్రత్రికి తరలించారు. అనంతరం ఆయన్ని ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికి ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను పోలీసులు భారీ బందోబస్తు నడుమ చర్లపల్లి జైలుకు తరలించారు.
Post Top Ad
Thursday, March 05, 2020
కేటీఆర్ ఫామ్ హౌస్‌పై డ్రోన్ ఎగరేసినందుకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి జైలుకి ....
Admin Details
Subha Telangana News