నామినేషన్లు దాఖలు చేసిన తెరాస రాజ్యసభ అభ్యర్థులు కె.కేశవరావు, కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, March 14, 2020

నామినేషన్లు దాఖలు చేసిన తెరాస రాజ్యసభ అభ్యర్థులు కె.కేశవరావు, కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి


తెలంగాణ రాష్ట్ర 2 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం టీఆర్‌ఎస్‌ పక్షాన రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన డాక్టర్‌ కె.కేశవరావు, కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మె ల్యేలు వెంటరాగా అసెంబ్లీ ఆవరణలోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పక్షాన 4 సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు కాగా.. కేకే, సురేశ్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ పలువురు మంత్రులు, టీఆర్‌ ఎస్, ఏఐఎంఐఎం పార్టీల ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఒక్కో సెట్‌పై 10 మంది సంతకాలు చేయాల్సి ఉండగా, ఒక్కో సెట్‌పై నలుగురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కవిత, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి, కుమారులు వెంకట్, విప్లవ్‌.. సురేశ్‌రెడ్డి సతీమణి పద్మజారెడ్డి అసెంబ్లీకి వచ్చిన వారిలో ఉన్నారు.నామినేషన్ల కార్యక్రమం పూర్తయిన తర్వాత పార్టీ రాజ్యసభ సభ్యులతో కలిసి పార్టీ అభ్యర్థులు కేకే, సురేశ్‌రెడ్డి అసెంబ్లీ ఆవరణలోని సీఎం చాంబర్‌లో పార్టీ అధినేత కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Post Top Ad