రంగారెడ్డి జిల్లాలో భారీ బాంబు పేలుడు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, March 14, 2020

రంగారెడ్డి జిల్లాలో భారీ బాంబు పేలుడు

రంగారెడ్డి  జిల్లాలో భారీ బాంబు పేలుడు . శివరాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి చుట్టు పక్కల ఇళ్లలోని ఫర్నీచర్‌, ఇంటి అద్దాలు ధ్వంసం అయ్యాయి. రైల్వే సమీపంలో ఉన్న కాటేదాన్‌ వడ్డెర బస్తీలోని చెత్తకుప్పలో ఈ పేలుగు సంభవించింది. పేలుడు శబ్దం విని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. ఏదైనా రసాయన పదార్థం వల్ల పేలుడు సంభవించిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణ నష్టం ఏమి జరగలేదని పోలీసులు చెప్పారు. ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.

Post Top Ad