తెలంగాణాలో ఈ రోజు నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షలు : - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, March 04, 2020

తెలంగాణాలో ఈ రోజు నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షలు :


తెలంగాణ  రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,65,156 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. వీరిలో ఫస్టియర్‌ విద్యార్థులు 5,46,368 మంది, సెకెండియర్‌ విద్యార్థులు 5,18,788 మంది ఉన్నారు. వీరికోసం 1,411 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేశామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. కరోనా వైరస్ తెలంగాణ లో ప్రభలడంతో ఎటు తేల్చుకోలేని ఉపాధ్యాయ , విద్యార్థులు . 
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )