కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్య వ్యాఖ్యానాలు సంధించిన తెలంగాణ సీఎం కేసీఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, March 13, 2020

కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్య వ్యాఖ్యానాలు సంధించిన తెలంగాణ సీఎం కేసీఆర్

కేంద్రం నుంచి రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన నిధులకు కోతలు పెట్టడంలో ప్రస్తుత బీజేపీ సర్కారు గత కాంగ్రెస్ కంటే తాతలా తయారైందని సీఎం కేసీఆర్ విమర్శించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ఏడాది కూడా పట్టుమని 10వేల కోట్లు ఇవ్వలేదని, మోదీని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే గతయ్యే పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ సభ్యులు చేసిన విమర్శలకు గురువారం ఆయన అసెంబ్లీలో సమాధానం చెప్పారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయంటూ బీజేపీ నాయకులు అసత్యాలు మాట్లాడుతున్నారని, ఢిల్లీలో లేకలేక అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. కాంగ్రెస్ కంటే ఘోరంగా రాష్ట్రాలను పీక్కుతింటున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రావడానికి సుదీర్ఘకాలం ఎదురుచూసిందని, అది కూడా యూపీఏ పాలనపై విసుగుతోనే జనం బీజేపీని గెలిపించారుతప్ప ప్రత్యేకంగా వాళ్లకంటూ ఘనతలేదని, అదే టీఆర్ఎస్ మాత్రం ఉద్యమపార్టీగా పుట్టి, రాష్ట్రాన్ని సాధించుకుని అధికారం చేపట్టిందని సీఎం గుర్తుచేశారు. దేశాన్ని నడిపించడంలో జాతీయ పార్టీలుగా కాంగ్రెస్‌, బీజేపీలు అట్టర్‌ప్లాఫ్‌ అయ్యాయని, రాకరాక వచ్చిన చాన్సును బీజేపీ దారుణంగా దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు.కేంద్రం నుంచి రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన నిధులకు కోతలు పెట్టడంలో ప్రస్తుత బీజేపీ సర్కారు గత కాంగ్రెస్ కంటే తాతలా తయారైందని సీఎం కేసీఆర్ విమర్శించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ఏడాది కూడా పట్టుమని 10వేల కోట్లు ఇవ్వలేదని, మోదీని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే గతయ్యే పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ సభ్యులు చేసిన విమర్శలకు గురువారం ఆయన అసెంబ్లీలో సమాధానం చెప్పారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయంటూ బీజేపీ నాయకులు అసత్యాలు మాట్లాడుతున్నారని, ఢిల్లీలో లేకలేక అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. కాంగ్రెస్ కంటే ఘోరంగా రాష్ట్రాలను పీక్కుతింటున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రావడానికి సుదీర్ఘకాలం ఎదురుచూసిందని, అది కూడా యూపీఏ పాలనపై విసుగుతోనే జనం బీజేపీని గెలిపించారుతప్ప ప్రత్యేకంగా వాళ్లకంటూ ఘనతలేదని, అదే టీఆర్ఎస్ మాత్రం ఉద్యమపార్టీగా పుట్టి, రాష్ట్రాన్ని సాధించుకుని అధికారం చేపట్టిందని సీఎం గుర్తుచేశారు. దేశాన్ని నడిపించడంలో జాతీయ పార్టీలుగా కాంగ్రెస్‌, బీజేపీలు అట్టర్‌ప్లాఫ్‌ అయ్యాయని, రాకరాక వచ్చిన చాన్సును బీజేపీ దారుణంగా దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు.

Post Top Ad