తెలంగాణ సీఎం కేసీఆర్ కి కౌంటర్ ఇచ్చిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, March 09, 2020

తెలంగాణ సీఎం కేసీఆర్ కి కౌంటర్ ఇచ్చిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

భారత దేశ  కేంద్ర   ప్రభుత్వం  సీఏఏ, ఎన్పీఆర్‌లపై  అసెంబీలో  తెలంగాణ సీఎం  కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు  ను కేంద్ర  హోమ్ శాఖ  సహాయ మంత్రి  కిషన్ రెడ్డి  తీవ్రంగా   ఖండించారు . వివరాలలోకి వెల్తే  రిజర్వేషన్ల గురించి మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్ ప్రభుత్వానికి లేదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాగా, తెలంగాణ అసెంబ్లీలో శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేసీఆర్ మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్పీఆర్‌లపై స్పందించారు. సీఏఏ, ఎన్పీఆర్‌లపై ప్రజల్లో ఆందోళన ఉందని, ఇది దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశమని అన్నారు. తనకే బర్త్ సర్టిఫికేట్ లేదని.. ఇక తన తండ్రిది ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అవసరమైతే నేషనల్ ఐడెంటిటీ కార్డు పెట్టండని కేంద్రానికి సూచించారు. అంతేగాక, సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పెడతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Post Top Ad