గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి మరొకరికి గాయాలు..... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, March 04, 2020

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి మరొకరికి గాయాలు.....


వికారాబాద్ జిల్లా ప్రతినిధి: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన వికారాబాద్ జిల్లా  లోని మండల పరిధిలోని మేక వనం పల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది పోలీసు ల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి మేక వనం పల్లి గ్రామానికి చెందిన చాకలి గోపాల్ చంద్రయ్య కలిసి సంగారెడ్డి జిల్లా సదాశివపేట నుండి రాత్రి సమయంలో బైక్పై వస్తుండగా  మేక వనం పల్లి గ్రామం దగ్గర మోమిన్పేట వైపునుండి అతివేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు గాయపడిన చంద్రయ్యను సంగారెడ్డి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఢీ కొట్టిన లారీ కోసం అన్ని రోడ్లలో తనిఖీ నిర్వహించి ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ ను త్వరలో పట్టుకొని కోర్టు ఇస్తామన్నారు