విద్యార్థులపై నిరంకుశ ధోరణికి తెరలేపిన తెలంగాణ సర్కార్ : విద్యార్థులపై లాఠీ ఛార్జ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, March 11, 2020

విద్యార్థులపై నిరంకుశ ధోరణికి తెరలేపిన తెలంగాణ సర్కార్ : విద్యార్థులపై లాఠీ ఛార్జ్


విద్యార్థులపై నిరంకుశ ధోరణికి తెరలేపిన తెలంగాణ సర్కార్ : విద్యార్థులపై లాఠీ ఛార్జ్  వివరాలలోకి వెళ్తే , తెలంగాణ రాష్ట్రంలో ని  విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏబీవీపీ బుధవారం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అసెంబ్లీ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకొని వెనక్కు నెట్టారు.అయినప్పటికీ ఏబీవీపీ నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేసి వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Post Top Ad