హైదరాబాద్ రూపు రేఖలు మార్చే దిశగా కేటాయింపులు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం : హర్షం వ్యక్తం చేస్తున్న హైదరాబాద్ వాసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, March 09, 2020

హైదరాబాద్ రూపు రేఖలు మార్చే దిశగా కేటాయింపులు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం : హర్షం వ్యక్తం చేస్తున్న హైదరాబాద్ వాసులు


భారత దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న ప్రాంతం ఏదంటే హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో మినీ భారత్‌గా విరాజిల్లుతోంది భాగ్యనగరం ప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం... హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టిపెట్టింది. బడ్జెట్‌లో 10వేల కోట్లు కేటాయించింది. అయితే.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో... టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్ డ్రామాకు తెరలేపిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.  కోహైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. హైదరాబాద్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళన కోసం పదివేల కోట్ల నిధులను బడ్జెట్‌లో కేటాయించింది కేసీఆర్ సర్కార్. కోటి మందికిపైగా జనాభా నివసిస్తోన్న హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం సమకూరుతోంది. దీంతో బడ్జెట్లో నగరానికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ శాఖకు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో రూ. 14వేల 809 కోట్లు కేటాయించింది. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంలో భాగంగా ఏర్పాటు చేసిన మెట్రో ట్రైన్ మెరుగైన సేవలందిస్తోంది. నిత్యం లక్షల మంది ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుతున్నారు. పాత బస్తీలో మిగిలిన మెట్రో రూట్‌ను త్వరగా పూర్తి చేయడమే కాకుండా... మిగతా మార్గాలకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాయదుర్గం నుంచి శంషాబాద్, బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు మెట్రో రైలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు.హైదరాబాద్‌‌లో ప్రస్తుతం 118 బస్తీ దవాఖానాలు పేదలకు వైద్య సేవలు అందిస్తున్నాయి. వాటిని 350కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో అదనంగా బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం వచ్చే ఐదేళ్లలో దాదాపుగా 50 వేల కోట్లు అవసరమని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Post Top Ad