చిన్న పిల్లలను అక్రమ రవాణా చేస్తున్న ముఠా ను పట్టుకున్న పోలీసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, March 02, 2020

చిన్న పిల్లలను అక్రమ రవాణా చేస్తున్న ముఠా ను పట్టుకున్న పోలీసులు

తెలంగాణ రాష్ట్రంలో చిన్న  పిల్లలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఎల్బీ నగర్ జంక్షన్ వద్ద గల పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ బస్సు అనుమానాస్పదంగా ఆగి ఉండడం గమనించిన పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా, అందులో పిల్లలు కనిపించారు. వీరిని కొందరు అక్రమంగా తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 11 మంది చిన్నారులను ఛత్తీస్ గఢ్ నుంచి హైదరాబాద్‌కు తరలించినట్లుగా తెలుస్తోంది. నగరంలో వివిధ చోట్ల ఈ పిల్లలను పనికి పెట్టేందుకే వీరిని ఛత్తీస్ గఢ్ నుంచి తరలించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.పోలీసులు వెంటనే ఆ పిల్లలను రక్షించి సైదాబాద్‌ ప్రాంతంలోని స్టేట్ హోంకు తరలించారు. ఈ దందా వెనుక ఉన్నవారిని వదిలిపెట్టబోమని, విచారణ జరిపి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ‘‘పిల్లలను అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించాం. వారిని వెంటనే స్టేట్ హోంకు తరలించి, కేసు నమోదు చేశాం. ఇలా పిల్లల అక్రమ రవాణాకు సూత్రధారులైన వారిని త్వరలోనే అరెస్టు చేస్తాం.’’ అని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తమకు ఫోన్‌లో తెలిపినట్లుగా ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )