హైదరాబాద్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిలిపివేశారా ..? - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, March 04, 2020

హైదరాబాద్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిలిపివేశారా ..?


కరోనా వైరస్ తాకిడితో కరోనా వైరస్ తాకిడితో హైదరాబాద్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో భాగంగా పోలీసులు అందరికీ ఒకే యంత్రం వాడుతుంటారని, దీనివల్ల కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకు ఆస్కారం ఉంటుందని ప్రచారం జరిగింది. అందువల్ల ఈ టెస్టులు కొద్ది రోజులు ఉండబోవని పుకార్లు పుట్టాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్పందించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు రద్దు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టత ఇచ్చారు. ఆ పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని చెప్పారు. ఈ పరీక్షల వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందన్న భయం ఉన్నప్పటికీ టెస్టులు చేసే క్రమంలో అన్ని జాగ్రత్తలు పటిష్ఠంగా తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రతి పరీక్షకు వేర్వేరు స్ట్రాలు ఉపయోగించి, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపడతామని వెల్లడించారు.కరోనా నేపథ్యంలోనే బెంగళూరులో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిలిపివేశారు. ఇదే తరహాలో హైదరాబాద్‌లోనూ తాత్కాలికంగా ఆపుతారని ప్రచారం జరిగింది. ముఖ్యంగా మందుబాబులు దీన్ని తెగ ప్రచారం చేసుకున్నారు.నిలిపివేస్తున్నారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో భాగంగా పోలీసులు అందరికీ ఒకే యంత్రం వాడుతుంటారని, దీనివల్ల కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకు ఆస్కారం ఉంటుందని ప్రచారం జరిగింది. అందువల్ల ఈ టెస్టులు కొద్ది రోజులు ఉండబోవని పుకార్లు పుట్టాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్పందించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు రద్దు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టత ఇచ్చారు. ఆ పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని చెప్పారు. ఈ పరీక్షల వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందన్న భయం ఉన్నప్పటికీ టెస్టులు చేసే క్రమంలో అన్ని జాగ్రత్తలు పటిష్ఠంగా తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రతి పరీక్షకు వేర్వేరు స్ట్రాలు ఉపయోగించి, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపడతామని వెల్లడించారు.కరోనా నేపథ్యంలోనే బెంగళూరులో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిలిపివేశారు. ఇదే తరహాలో హైదరాబాద్‌లోనూ తాత్కాలికంగా ఆపుతారని ప్రచారం జరిగింది. ముఖ్యంగా మందుబాబులు దీన్ని తెగ ప్రచారం చేసుకున్నారు.

Post Top Ad