ఇంటర్‌ విద్యార్థులు మాస్క్‌లు ధరించి పరీక్షలు రాయడానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్అనుమతులు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, March 05, 2020

ఇంటర్‌ విద్యార్థులు మాస్క్‌లు ధరించి పరీక్షలు రాయడానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్అనుమతులు

తెలంగాణ లో కరోనా వైరస్ పాజిటివ్‌ కేసు నమోదయిన నేపథ్యంలో వైరస్‌ విస్తరించకుండా తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా  కొనసాగుతున్న  ఇంటర్ పరీక్షలు. విద్యార్ధుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని ఇంటర్‌ విద్యార్థులు మాస్క్‌లు ధరించి పరీక్షలు రాయడానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్అనుమతులు ఇచ్చింది . కరోనా వైరస్‌ వ్యాపించకుండా పరీక్ష కేంద్రాలను శుభ్రంగా ఉంచాలని సూపరింటెండెంట్ల కు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు వాటర్ బాటిల్స్ తెచ్చుకోవడానికి అనుమతిచ్చింది. కాగా దగ్గు, జలుబుతో బాధపడే విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించనున్నారు. జలుబుతో బాధపడే ఇన్విజిలేటర్లకు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్ణయించింది.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )