హైదరాబాద్ లోని నాచారం ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు బాంబు బెదిరింపు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, March 10, 2020

హైదరాబాద్ లోని నాచారం ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు బాంబు బెదిరింపు

 నగరంలోని నాచారం ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తుతెలియని ఆగంతకులు స్కూల్‌ మేనేజ్‌మెంట్‌కు మెయిల్‌ ద్వారా సందేశం పంపారు. పాఠశాల ఆవరణలో బాంబు అమర్చినట్లు అది ఏ క్షణమైనా పేలొచ్చని తెలిపారు. పాఠశాల సిబ్బందిలో ఒకరు సంస్థ మెయిల్స్‌ను చూస్తుండగా విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాంబ్‌ స్కాడ్‌ సిబ్బంది, నాచారం పోలీసులు హుటాహుటిన పాఠశాలకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మెయిల్‌ సమాచారం నకిలీదిగా పోలీసులు తేల్చారు. మెయిల్‌ పంపిన వ్యక్తి ఐపీ చిరునామా ద్వారా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Post Top Ad