హెచ్‌సీయూలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ ఉత్సవాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, March 07, 2020

హెచ్‌సీయూలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ ఉత్సవాలు

హెచ్‌సీయూలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సమావేశంలో ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, సామాజికవేత్త వసంత కన్నబిరాన్‌ ప్రధాన వక్తగా విచ్చేశారు. ముఖ్య అతిథులుగా ఆచార్య తుమ్మల రామకృష్ణ, డిప్యూటీ డీఎస్‌ డబ్ల్యూ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వసంత కన్నబిరాన్‌ మాట్లాడుతూ.. స్త్రీలు వాళ్ల హక్కుల కోసం మాత్రమే కాదు, పౌర హక్కులు, మానవ హక్కులు, ప్రజా న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఆచార్య డి. విజయలక్ష్మీ సమావేశానికి స్వాగతం పలుకుతూ... సమాజంలో మహిళల ప్రాధాన్యాన్ని కొనియాడారు. ఈ సమావేశంలో తెలుగు విభాగం బోధనా సిబ్బంది, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, ఏంఏ పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

Post Top Ad