కరోనా వైరస్ గురించి జాగ్రత్తలు తెలిపిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ : - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, March 04, 2020

కరోనా వైరస్ గురించి జాగ్రత్తలు తెలిపిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ :

తెలంగాణ ప్రజలకు ఎవరికీ కరోనా సోకలేదని.. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి మాత్రమే సోకిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్   తెలిపారు. ‘ఒక వేళ తెలంగాణలో ఉన్న వారికి వచ్చినా.. ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. గాంధీ హాస్పిటల్‌తోపాటు చెస్ట్ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్‌తోపాటు వికారాబాద్ హాస్పిటల్‌ను ఐసోలేషన్ కోసం వాడుకుంటున్నామని ఈటల తెలిపారు. ఒక్కో కాలేజీలో 250 బెడ్లను ఐసోలేషన్ కోసం, 50 బెడ్లను ట్రీట్మెంట్ కోసం ఉపయోగించేలా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీలతో మాట్లాడామన్నారు. అన్నీ కలిపి 3 వేలకుపైగా బెడ్లను వాడుకునే అవకాశం ఉందన్న ఆయన.. చికిత్స కోసం 250 బెడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.కేంద్రంతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నామన్న ఈటల.. కేంద్ర ఆర్థిక మంత్రి హర్ష వర్ధన్‌తో తాను మాట్లాడానన్నారు.
  • ఈ వైరస్ గాలి ద్వారా సోకే అవకాశం లేదని ఈటల తెలిపారు. 
  • తుప్పిర్లు మీద పడినప్పుడు మాత్రమే ఈ వ్యాధి సోకుతుందన్నారు.
  • వ్యాధిగ్రస్తుడి తుప్పిర్లను తాకి.. చేతిని కడుక్కోకుండా నోటి దగ్గర లేదా ముక్కు దగ్గర పెట్టుకుంటే వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. 
  • ఎప్పటికప్పుడూ చేతులను శుభ్రంగా కడుక్కోగలిగితే.. 99 శాతం వ్యాధిని అరికట్టే అవకాశం ఉందన్నారు.

 తెలంగాణలో మాస్కుల కొరత ఉందని.. సరఫరా చేయాలని కోరామన్నారు. దానికి కేంద్ర మంత్రి సుముఖ వ్యక్తం చేశారని ఈటల తెలిపారు. జనసమ్మర్థంలోకి వెళ్లే వారు తప్పకుండా ముఖానికి హ్యాండ్ కర్చీప్ అడ్డుపెట్టుకోవాలని మంత్రి సూచించారు. తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు కర్చీప్ అడ్డుపెట్టుకోవాలన్నారు. చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.‘హ్యుమిడిటీ ఎక్కువగా ఉండి, వేడి తక్కువగా ఉండే చోట ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. మన దగ్గర వేడి ఎక్కువ కాబట్టి వైరస్ విస్తరించే అవకాశం తక్కువగా ఉంది. వైరస్ గురించి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రకటనల రూపంలో ప్రచారం చేపట్టనుంది. 104ను కరోనా వైరస్ హెల్ప్ లైన్‌గా ప్రకటించాం’ అని మంత్రి ఈటల తెలిపారు. అన్ని విభాగాలతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. పట్టణాల్లో జనసాంద్రత ఎక్కువ కాబట్టి.. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. కరోనా వైరస్ ప్రభావం ఉన్న దేశాలకు ప్రయాణాలు తలపెట్టొద్దని ప్రజలకు సూచించారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )