తెలంగాణ సర్కార్ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తం అయ్యింది. ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశ కొనసాగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 107 కేసులు నమోదయినట్టు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ప్రకటించింది. తెలంగాణలోనే తొలి కరోనా మృతి చోటు చేసుకోవడంతో... ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. మరో కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కావడంతో వైరస్ ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుటుంది. ఈ నేపథ్యంలోనే భాగ్యనగరంలో ప్రముఖ పార్కులన్నీ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు(జీఓ నెం.4) హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) పరిధిలోని పార్కులను మూసివేస్తున్నామన్నారు.