ఢిల్లీలోని ప్రైమరీ పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, March 05, 2020

ఢిల్లీలోని ప్రైమరీ పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయం

కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ప్రైమరీ పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మనీష్‌ సిపోడియా ట్వీట్‌ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా, ముందు జాగ్రత్తగా ప్రైమరీ స్కూళ్లను ఈ ఏడాది మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ఈ సెలవులు ప్రభుత్వ, ఎయిడెడ్‌, ఎంసీడీ, ఎన్డీఎమ్‌సీ ప్రైమరీ స్కూళ్లకు వర్తించనున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ 60 దేశాలకు వ్యాప్తి చెందింది. ప్రపంచ వ్యాప్తంగా 3 వేల మందికి పైగా ఈ వైరస్‌ బారిన పడి మృతి చెందారు. సుమారు 90 వేల మందికి పైగా కరోనా సోకింది. భారత్‌లో 30 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 16 మంది ఇటలీ దేశస్థులు ఉన్నారు.

Post Top Ad