సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై అసెంబ్లీ లో కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, March 07, 2020

సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై అసెంబ్లీ లో కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్

దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన వివాదాస్పద చట్టాలు సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై కేసీఆర్‌ సభలో ప్రస్తావించారు. వీటిపై పౌరులంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. సీఏఏపై అనేక అనుమానాలు ఉన్నాయని, వీటిపై ఓ రోజంతా సభలో చర్చించి తీరుతామని సీఎం అసెంబ్లీలో ప్రసంగించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తనకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేదని, ఇక సామన్య ప్రజలకు ఏం ఉంటుందని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇలాంటి చట్టాలపై దేశ వ్యాప్తంగా సుధీర్ఘ చర్చ జరగాలన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఈ చట్టాలపై తమ అభిప్రాయాలను వెల్లడించాలని సీఎం కోరారు.

Post Top Ad