కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ : కీలక నిర్ణయాలు వెల్లడి - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, March 15, 2020

కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ : కీలక నిర్ణయాలు వెల్లడి


కరోనా వైరస్ అంశంపై మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ నిన్న సాయంత్రం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. విద్యా సంస్థలు, బార్లు, థియేటర్లను మార్చి 31 వరకు మూసేయాలని ఆదేశించారు. పెళ్లిళ్లు తదితర శుభకార్యాలను కూడా వాయిదా వేసుకోవాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  మార్చి 31 పెళ్లిళ్లు , శుభకార్యాలకు కు సంభందించి పంక్షన్ హాల్ లకు పర్మిట్ ఇవ్వమని వెల్లడించారు . మర్చి 31 వరకు జరిగే పెళ్లిళ్లు 200 మందితో మాత్రమే , తగిన జాగ్రత్తలతో జరుపుకోవాలని విజ్ఞప్తి చేసారు . కరోనా వైరస్ నియంత్రణ చర్యలకు సంబంధించి తక్షణం రూ.500 కోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆరోగ్య శాఖ పూర్తి అప్రమ్తంగా ఉందని, శంషాబాద్ విమానాశ్రయంలో 200 మంది స్క్రీనింగ్ చేస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు.ఇప్పటికే 1020 ఐసోలేషన్ బెడ్స్ సిద్ధం చేసినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 321 ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను కూడా సిద్ధం చేసినట్లు చెప్పారు. 240 వెంటిలేటర్లు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కరోనా వైరస్ ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రంలో నాలుగు క్వారంటైన్ కేంద్రాలను కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు.

Post Top Ad