జూన్ లో తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణి : వెల్లడించిన మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, March 15, 2020

జూన్ లో తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణి : వెల్లడించిన మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌


తెలంగాణ రాష్ట్రంలో రెండోవిడుత గొర్రెలను జూన్‌నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గొర్రెల కోసం ఇప్పటికే 28 వేల డీడీలు పెండింగ్‌లో ఉన్నాయని, వీరికే పంపిణీ చేస్తామని ప్రకటించారు. వీటికి బీమా సౌకర్యాన్ని వర్తింపజేస్తామనని తెలిపారు.నష్టాల్లో కూరుకున్న విజయ డెయిరీని లాభాల్లోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, జాతీయ రహదారులపై ప్రత్యేకంగా విజయ డెయిరీ ఉత్పత్తులను విక్రయించే స్టాళ్లను ఏర్పాటుచేస్తామని వివరించారు. చరిత్రలోనే ప్రప్రథమంగా జీవాలకు గుర్తింపు కార్డులను అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 680 వెటర్నరీ దవాఖానల్లో సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

Post Top Ad