తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీ లో మరో కరోనా నిర్దారణ కేంద్రం ఏర్పాటు : - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, March 11, 2020

తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీ లో మరో కరోనా నిర్దారణ కేంద్రం ఏర్పాటు :


తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా నిర్దారణ కేంద్రం ఏర్పాటు .  హైదరాబాద్‌ ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా కోవిడ్‌ వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం అనుమతినిచ్చిందని, అందుకు అవసరమైన పరికరాలు, కిట్లను పంపుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. మంగళవారం సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు మరో సమావేశం నిర్వహించారు. ఆయా సమావేశ వివరాలన్నింటినీ మంత్రి ఈటల రాజేందర్‌ మంగళవారం రాత్రి మీడియాకు వివరించారు. గాంధీ వైరాలజీ ల్యాబ్‌కు అదనంగా ఉస్మానియాలో ఏర్పాటు చేయబోయే కోవిడ్‌ నిర్ధారణ కేంద్రం పనిజేస్తుందన్నారు. అలాగే హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం)లోనూ కోవిడ్‌ పరీక్ష నిర్ధారణ కేంద్రానికి అనుమతి కోరామన్నారు. కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు తా జాగా పరీక్షలు నిర్వహించామని, నెగటివ్‌ వచ్చిందన్నారు. మరోమారు పరీక్ష చేసి, నాలుగైదు రోజుల్లో అతన్ని డిశ్చార్జి చేస్తామన్నారు. అంటే ఈ క్షణానికి తెలంగాణలో ఒక్క మనిషికి కూడా కోవిడ్‌ వైరస్‌ లేదని మంత్రి సగర్వంగా ప్రకటించారు. విమానాశ్రయంలో 24 గంటలూ స్క్రీనింగ్‌ చేయడానికి ఏర్పాటు చేశామన్నారు.

Post Top Ad