రోజుకి కోటిన్నర లాభాలని ఆర్జిస్తూ లాభాల బాటలోకి వెళ్లిన తెలంగాణ ఆర్టీసీ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, March 12, 2020

రోజుకి కోటిన్నర లాభాలని ఆర్జిస్తూ లాభాల బాటలోకి వెళ్లిన తెలంగాణ ఆర్టీసీ


రోజుకి కోటిన్నర లాభాలని ఆర్జిస్తూ లాభాల బాటలోకి వెళ్లిన తెలంగాణ ఆర్టీసీ వివరాలలోకి వెళ్తే తెలంగాణ ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ఆర్టీసీకి రోజుకు రూ. 1.50 కోట్లు లాభం వస్తోందని తెలిపారు. గత రెండు నెలలుగా ఆర్టీసీకి వచ్చిన ఆదాయంతోనే జీతాలిస్తున్నట్లు వెల్లడించారు. 2020, మార్చి 12వ తేదీ గురువారం ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సీసీఎస్ బకాయిలు, పీఎఫ్ బకాయిల చెల్లింపుల కోసం...రూ. 600 కోట్లు అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయన్నారు. జులై నాటికి రూ. 20 కోట్లతో ఖమ్మంలో బస్టాండు నిర్మాణం చేస్తామని, ప్రజాప్రతినిధుల ఫోన్లు ఆర్టీసీ అధికారులు లిఫ్ట్ చేయకపోవడం..సమాచారం ఇవ్వకపోవడం తప్పు అని వెల్లడించారు. ఆర్టీసీ పార్శిల్ సర్వీసుల ద్వారా సంవత్సరానికి రూ. 300 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 2020, మార్చి నెలాఖరుకు 100 కార్గొ బస్సులు సిద్ధం చేస్తామని ప్రకటించారు.

Post Top Ad