కేసీఆర్.అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, March 14, 2020

కేసీఆర్.అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ


కరోనా వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. దేశ వ్యాప్తంగా వ్యాధి వ్యాప్తి చెందుతున్న సందర్బంగా ప్రభుత్వం అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ నిర్వహిస్తామన్నారు. కరోనాపై హైలెవల్ కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. స్కూల్స్ మూసివేయాల వద్దా ? పెళ్లిళ్లు ఫంక్షన్లు, పబ్లిక్ గేదరింగ్స్ వంటి పరిస్థితి ఏంటి అన్న దానిపై సాయంత్రం కేబినెట్ భేటీ నిర్వహించి కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. కేబినెట్ భేటీలో దీనిపై ఓ అవగాహన వస్తుందన్నారు. మాస్క్‌లు అన్ని సిద్ధంగా ఉంచుతున్నామన్నారు. రోగులకు వైద్యం చేసే డాక్టర్ల కోసం కూడా ప్రత్యేక మాస్క్‌లు అవసరం అవుతాయన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అసవరమైతే... 5వేల కోట్లు అయినా ఖర్చు చేసి కరోనాను ఎదుర్కుంటామన్నారు.

Post Top Ad