తెరాస పార్టీ పై తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, March 02, 2020

తెరాస పార్టీ పై తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి


తెలంగాణ రాష్ట్రంలో ని  అధికార టీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకే రంగులు వేసి డబుల్ బెడ్ రూం ఇళ్లుగా చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌ ఎక్కడా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల గురించి ప్రస్తావించడమే లేదని అన్నారు. నాబార్డు ఇచ్చిన డబుల్‌ బెడ్‌రూమ్‌ నిధులను.. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దారి మళ్లించిందని ఆరోపించారు. పేదలకు ఇళ్లకు తాళాలు ఇచ్చాకే ఓట్లు అడుగుతామని చెప్పిన వారు.. ఎన్నికలైనా వాటిని ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. ఏప్రిల్‌లోపు పేదలకు న్యాయం జరగకపోతే ప్రజా పోరాటానికి దిగుతామని ఆయన అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఏప్రిల్, మే నెలల్లో కలెక్టరేట్‌లను ముట్టడిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాబార్డ్ నుంచి వచ్చిన నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. కేంద్రం పేదల కోసం ఇచ్చిన నిధులు ప్రైవేటు కాంట్రాక్టుల వారి కోసం దారి మళ్లించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ పేదలకు దేవుడని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని, అధికారంలోకి వచ్చి ఆరేళ్లవుతున్నా వారి కష్టాలు ఎందుకు తీర్చడం లేదని రేవంత్ నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ప్రజల్లో ఎండగడతానన్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )