హైదరాబాద్ మెట్రో అధికారులు పేటీఎం భాగస్వామ్యంతో సులభతర టికెటింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు . గురువారం మెట్రో రైల్ భవన్ రసూల్‌పురాలో జరిగిన మీడియా సమావేశంలో మెట్రో అధికారులు, పేటీఎం ప్రతినిధులు కలిసి వివరాలుతెలియచేసారు . కార్యక్రమంలో మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ ఎండీ కేవీబీ రెడ్డి, పేటీఎం వైస్ ప్రెసిడెంట్ అభయ్‌శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ డిజిటల్ లావాదేవీల్లో ముందంజలో ఉందన్నారు. ప్రయాణికులు టికెట్ కోసం చాలా సమయం లైన్లో నిలబడే అవసరం లేకుండా పేటీఎంలో తీసుకునే అవకాశం కల్పిస్తున్నామని, ఈ నూతన సదుపాయాలతో మరింత సౌకర్యవంతంగా ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చన్నారు. డిజిటల్ మార్కెటింగ్‌లో దేశంలోనే పేటీఎం పెద్ద సంస్థ అని అన్నారు. అలాగే గత మూడు నెలల క్రితం వినియోగంలోకి తీసుకువచ్చిన క్యూఆర్ కోడ్ టికెటింగ్ విధానం ఉపయోగిస్తున్న వారి సంఖ్య నేటికి 60వేలకు చేరిందన్నారు.
అలాగే ప్రజలు మెట్రో రైలులో ప్రయాణించేటప్పుడు ‘కరోనా’ గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వచ్చిన వారిలో రోగ నిరోధక శక్తి లేని చాలా తక్కువ శాతం మంది మాత్రమే చనిపోతున్నారన్నారు. మెట్రో రైలును ప్రతిరోజు పూర్తిగా ఆర్-2 కెమికల్ శానిటైజర్లతో శుభ్రం చేస్తున్నట్లు, పార్ట్ టు పార్ట్ ప్రతి చోట స్టేషన్‌తో సహా శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )