ఇటలీ లో అవస్థలు పడుతున్న తెలుగు విద్యార్థులు : స్పందించిన కేటీఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, March 12, 2020

ఇటలీ లో అవస్థలు పడుతున్న తెలుగు విద్యార్థులు : స్పందించిన కేటీఆర్

కరోనా వైరస్ విజృంభిస్తున్న ఇటలీలో తెలంగాణకు చెందిన విద్యార్థులు చిక్కుకుపోయారు. వీరితోపాటు కర్ణాటకకు చెందిన మొత్తం 70 మంది వరకూ ఇటలీ రాజధాని రోమ్ విమానాశ్రయంలోనే ఉండిపోయారు. దీనికి సంబంధించి బాధితులు ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన తెలంగాణకు చెందిన రష్మి మయూర్ కొయ్యాడ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. రోమ్ ఎయిర్ పోర్టులో ఆహారానికి ఇబ్బందిపడుతున్నట్లు తెలుగు విద్యార్థులు తెలిపారు. కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ.. ఫిట్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని.. దీంతో స్వదేశానికి తిరిగి రాలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జయశంకర్‌ను, ఇటలీలోని ఇండియన్ ఎంబసీని ట్యాగ్ చేశారు. దయచేసి ఇటలీలోని రోమ్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ వారిని, ఇతర భారతీయులను సాయం చేయాల్సిందిగా విదేశాంగ మంత్రి జయశంకర్‌ను కోరారు. అలాగే ఇటలీలోని భారత రాయబార కార్యాలయ అధికారులు స్పందించి వారికి సహాయం చేసేలా సూచించాలని కేటీఆర్ కోరారు.

Post Top Ad